logo

పెన్సిల్‌తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు

చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

Updated : 06 May 2024 06:28 IST

చిత్రలేఖనంలో ఖానాపూర్‌ యువకుడి ప్రతిభ

హీరో రామ్‌, విజయ్‌ దళపతి చిత్రాలు

ఖానాపూర్‌, న్యూస్‌టుడే: చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన ఆడెపు గణేష్‌ డిగ్రీ వరకు చదివారు. కేవలం పెన్సిల్‌తోనే జీవం ఉట్టిపడేలా, ఆకట్టుకొనేలా బొమ్మలు వేస్తూ తన కళా ప్రతిభను చాటుతున్నారు. సినీ కథానాయకులు రామ్‌, విజయ్‌ దళపతి, కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ చిత్రాలు వేశార[ు. ఆకుపచ్చ, నలుపు, నీలి రంగు పెన్నులను వినియోగించి దుర్గాదేవి అమ్మవారు త్రిశూలం చేతబూనినట్టు వేసిన చిత్రం ఎంతో కళాత్మకంగా రూపుదిద్దుకుంది. అంజన్న స్వామితోపాటు ఇతర దేవతల చిత్రాలు సైతం వేసి మెప్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఈతరానికి తగ్గట్టు గీయగా ఆకట్టుకుంటుంది. మనిషిని చూసి బొమ్మ వేయమంటే చాలు నిమిషాల్లోనే వేసేస్తారు. గణేష్‌ తన కుటుంబంలోని చిన్నారుల చిత్రాలను ఉన్నది ఉన్నట్టు వేసి మెప్పించారు. తాను నేర్చుకున్న చిత్రకళా రంగాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుని ప్రస్తుతం గోడరాతలు, ఆలయాలకు పెయింటింగ్స్‌ వంటివి వేస్తున్నారు.

గణేష్‌ వేసిన హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ చిత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని