logo

పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు

బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..

Updated : 06 May 2024 08:50 IST

బెల్లంపల్లి గ్రామీణం: బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గత నెల 24న కాసిరెడ్డిపల్లెకు చెందిన సుంకరి ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతి(22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే భర్త వధువును ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆ యువతి ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్‌లే తాగుతుందని ప్రవీణ్‌ చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. ఈ విషయమై వరుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా తమకేమి సంబంధం లేదన్నట్లు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. పలుమార్లు చరవాణిలో సంప్రదించగా నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నట్లు తెలిపారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకుందామని చెబుతూ మాట దాటవేస్తూ, అమ్మాయితో కాపురం చేయడం ఇష్టం లేదంటూ, ఇంటికి వస్తే తాళం వేసుకొని బయటకు వెళ్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాళ్లగురిజాల ఎస్సై నరేష్‌ను వివరణ కోరగా సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు రావాలని చెప్పామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని