logo

ప్రశాంతంగా నీట్‌

వైద్య విద్యలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Published : 06 May 2024 05:11 IST

జిల్లాలో 97.83 శాతం హాజరు

విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న నిర్వాహకులు

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: వైద్య విద్యలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష సాగింది. 1384 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1354 మంది పరీక్షరాశారు. 97.83 శాతం హాజరు నమోదైందని నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌ రినెట్‌ తెలిపారు.

పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైనా 1.30 తర్వాత లోనికి అనుమతి లేకపోవడంతో అభ్యర్థులు ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బయోమెట్రిక్‌ హాజరు నేపథ్యంలో పరీక్షకు మూడు గంటల ముందు నుంచే(ఉదయం 11 నుంచి) హాలులోకి విద్యార్థులను తనిఖీ చేసి అనుమతించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, చేతిగడియారాలు, చరవాణులు, పరీక్ష ప్యాడ్‌ల, ఆభరణాలు, బూట్లు ధరించడం వంటివి అనుమతించలేదు. పరీక్షకు తీసుకెళ్లాల్సిన వాటిని ముందుగానే సూచించినా నిర్లక్ష్యంతో విద్యార్థులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫొటోల కోసం ఓ పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా ఫొటో ప్రింటర్‌ సదుపాయాన్ని కల్పించారు. ఉదయం 11 నుంచే కేంద్రాలకు అనుమతి ఉన్న దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఆలస్యంగా రావడం, కేంద్రాల చిరునామాలు దొరకకపోవడంతో చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగులు పెట్టారు.

రహస్య ఇన్విజిలేటర్‌

నీట్‌ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పరీక్షల్లో కాఫీయింగ్‌, తప్పిదాలకు పాల్పడేవారిని అడ్డుకునేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తొలిసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించింది. ఇది నిరంతర సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథమ్‌తో విద్యార్థుల అనుమానాస్పద కదలికలను పసిగడుతుంది. విద్యార్థులు ఏమైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తించేలా దీన్ని ఉపయోగించారు.

గేట్లు మూసేస్తున్న చివరి నిమిషంలో పరుగెడుతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని