logo

రిమ్స్‌లో అందుబాటులోకి మెరుగైన సేవలు

రిమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు సేవలు అందిస్తున్నామని రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జైసింగ్ వెల్లడించారు.

Published : 06 May 2024 18:04 IST

ఎదులాపురం: రిమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు సేవలు అందిస్తున్నామని రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జైసింగ్ వెల్లడించారు. రిమ్స్ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రిమ్స్ లో ప్రస్తుతం 120 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా మరో 50 పెంచటానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 72 మంది పీజీ వైద్యులతో పాటు సీనియర్ రెసిడెన్సి వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్డియాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ ప్రత్యేక వైద్య నిపుణులు సేవలందిస్తున్నారన్నారు. రేడియాలజీ విభాగంలో రూ.3.5 కోట్లతో సిటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, కలర్ డాప్లర్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మారై సేవలను త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం జరుగుతుందని బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా రిమ్స్‌లో అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని