logo

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పథకం నీరు సరిగా రావడం లేదంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

Updated : 07 May 2024 16:02 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పథకం నీరు సరిగా రావడం లేదంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయితీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు నీరు సరిగా వచ్చేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని