logo

‘కార్పొరేట్‌ వ్యాపారి.. భూగర్భ కార్మికుడి మధ్య పోరు’

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కార్పొరేట్‌ వ్యాపారి గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్‌ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 09 May 2024 06:27 IST

మందమర్రిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమల వేస్తున్న కొప్పుల ఈశ్వర్‌, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కార్పొరేట్‌ వ్యాపారి గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్‌ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం రాత్రి మందమర్రి మార్కెట్‌లో ఎన్నికల ప్రచార సభలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి మాట్లాడారు. అబద్దాల ఆరు గ్యారంటీల పునాదులపై కాంగ్రెస్‌ పార్టీ పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంద్‌ చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు అడిగినవే కాకుండా అడగనివి కూడా కేసీఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను తాము అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్సంటేజీలు తీసుకుని ఇక్కడి బొగ్గు గనులు అదానికి కట్టబెడుతున్నారని, ఇందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. కరెంట్‌ కోతలు, తీవ్ర నీటి సమస్యతో ప్రజలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయకుంటే ప్రజలతో కలిసి అందులోకి వెళ్తామన్నారు. అంతకుముందు ఇక్కడి వచ్చిన వారికి కళాకారులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జె.రవిందర్‌, మేడిపల్లి సంపత్‌, మద్ది శంకర్‌, రాం వేణు, సూరిబాబు, తిరుపతిరెడ్డి, బట్టు రాజ్‌కుమార్‌, తోట సురేందర్‌, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని