logo

ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్‌వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు.

Updated : 10 May 2024 06:23 IST

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్‌వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. ఓటరు స్లిప్‌లు అందని వారు పోలింగ్‌ కేంద్రం, క్రమసంఖ్య ఏమిటి తమ ఓటు ఎక్కడుందో అని ఆందోళనకు గురవుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అంత ఇబ్బంది లేకున్నా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో స్లిప్‌లు అందని వారు ఓటరు జాబితాలో తమ పేరు కోసం గంటల తరబడి వెతుకుతుంటారు. తమ పేరు కనిపించలేదని చాలా మంది నిరాశకు గురవుతారు. అయితే జాబితాలు తమ పేరు క్రమసంఖ్య సులువుగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఓ అవకాశాన్ని కల్పించింది. ఏదేని చరవాణి నెంబరుతో సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎంఎస్‌) పంపడం ద్వారా పోలింగ్‌ బుత్‌ సంఖ్య, ఓటరు జాబితాలో పేరు ఎక్కడుందో సులువుగా గుర్తించవచ్చు. దీనికోసం 1950 టోల్‌ఫ్రీ నంబరు తమ చరవాణి నుంచి నిదిఖి అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు  ఆంగ్ల అక్షరాలతో సహా టైప్‌ చేసి ఎస్‌ఎంఎస్‌ పంపిచాలి. క్షణాల్లో మీరు ఓటు వేసే పోలింగ్‌ బూత్‌ సంఖ్య, ఓటరు జాబితాలో మన పేరు ఉన్న క్రమసంఖ్య సందేశం రూపంలో వస్తుంది.

ఉదా.ECI RUA1276980 అని టైప్‌ చేసి 1950కి ఎస్‌ఎంస్‌ చేయాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని