logo

వైకాపా పాలనలో మన్యం నిర్లక్ష్యం

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతులపాలిట శాపంగా మారుతుందని, ప్రజలు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని అరకులోయ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు.

Published : 07 May 2024 06:50 IST

పెదబయలు వారపు సంతలో పాంగి రాజారావు, దొన్నుదొర ప్రచారం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతులపాలిట శాపంగా మారుతుందని, ప్రజలు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని అరకులోయ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు. పెదబయలులో సోమవారం జరిగిన వారపు సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజారావు మాట్లాడుతూ.. వైకాపా పాలనలో గిరిజన ప్రాంతం కనీస అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముసిడిపుట్టు నుంచి స్టేటుబ్యాంక్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. తెదేపా మండల అధ్యక్షురాలు సుకుమారి, మాజీ ఎంపీపీ కొండయ్య, చిన్ని, భాజపా మండల అధ్యక్షుడు రామయ్యు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని అరమ పంచాయతీ గ్రామాల్లో కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు, తెదేపా అరకు పార్లమెంట్‌ ఎస్టీసెల్‌ ఉపాధ్యక్షుడు కమ్మిడి సుబ్బారావు పాల్గొన్నారు.

రంపచోడవరం: నియోజకవర్గ తెదేపా మహిళా అధ్యక్షురాలు వై.నిరంజనీదేవి చినగెద్దాడ, పెదగెద్దాడ, డోకులపాడు, చెరువుపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. 

వీఆర్‌పురంలో కూటమి నేతల ర్యాలీ

మోతుగూడెం:  పొల్లూరులో ఎంపీటీసీ సభ్యుడు వేగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. 

కూనవరం: భగవాన్‌పురంలోని వైకాపాకు చెందిన 20 కుటుంబాల వారు తెదేపాలో చేరారు. ఆసు లక్ష్మయ్య, పులి కన్నారావు, ఆసు తమ్మయ్యల ఆధ్వర్యంలో వీరంతా చేరారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడవల్లి భాస్కరరావు, మండలాధ్యక్షుడు బరపాటి ప్రకాశరావులు వీరికి కండువాలు కప్పారు.

చింతపల్లి గ్రామీణం: మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ప్రచారం నిర్వహించారు. నాగభూషణం, పడాల్‌ సత్తిబాబు, బాబ్జి పాల్గొన్నారు.ఔ

గూడెంకొత్తవీధి. జి.మాడుగుల: ఆర్వీనగర్‌ వారపు సంత, ఇంటింటికీ వెళ్లి ఎన్డీఏ  నేతలు ప్రచారం చేశారు. భీమవరం తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రచారం చేశారు. జి.మాడుగుల, జోగులుపుట్టు, బూసిపల్లి గ్రామాల్లో ఎన్డీఏ పార్టీల నేతలు ప్రచారం చేశారు.

గుర్రాలగొంది గ్రామంలో...

ముంచంగిపుట్టు: కూటమి నాయకులు వనుగుమ్మ, మాకవరం, దోడిపుట్టు ప్రాంతాల్లో  పచారం నిర్వహించారు. నాయకులు బలరామ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అనంతగిరి గ్రామీణం: అనంతగిరిలో తెదేపా నాయకులు ప్రచారం చేశారు. నేతలు భూర్జ లక్ష్మి, దేముడు పాల్గొన్నారు.

అరకులోయ: కూటమిని గెలిపిస్తే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెదలబుడు సర్పంచి పెట్టెలి దాసుబాబు అన్నారు. అరకులోయలో ఇంటింటి ప్రచారం చేశారు.

అనంతగిరిలో తెదేపా ప్రచారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని