logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు విశేష స్పందన

తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ విజయ సునీత సందర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

Published : 07 May 2024 06:52 IST

తలార్‌సింగిలో ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ సునీత, చిత్రంలో సబ్‌ కలెక్టర్‌, అదనపు ఎస్పీ

పాడేరు, న్యూస్‌టుడే: తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ విజయ సునీత సందర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అంతకు ముందు స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను సందర్శించారు.

జిల్లాలో సోమవారం 3073 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. 15 మంది హౌస్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. 

అరకులోయ, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు  విశేష స్పందన లభించింది. అరకులోయ నియోజకవర్గానికి సంబంధించి కంఠబంసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సోమవారం 842 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 753 మంది, పాడేరు నియోజకవర్గానికి సంబంధించి 30 మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 59 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. ఈనెల 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ తెలిపారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అరకులోయలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు


అరకొర ఏర్పాట్లు.. ఉద్యోగులకు ఇక్కట్లు

పాడేరులో చెట్ల కింద ఉన్న ఉపాధ్యాయులు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఓటర్లకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో ఉద్యోగులకు ఆపసోపాలు తప్పలేదు. తలార్‌సింగి ఆశ్రమ పాఠశాలలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు.  పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. పోలింగ్‌ కేంద్రంలో నీడ సదుపాయం కూడా లేక ఉద్యోగులు సమీపంలోని చెట్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్‌ బూత్‌ల్లో పూర్తిస్థాయి ఎన్నికల పరికరాలు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలీచాలని గమ్ముతో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపరు కవరును అంటించారు. గెజిటేడ్‌ అధికారికి కావాల్సిన పెన్నులు, ఇతర వస్తువులు కూడా అందించలేదని ఒక అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని