logo

రాష్ట్రంలో కూటమిదే అధికారం

రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.

Published : 07 May 2024 06:55 IST

తెదేపాలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న పాడేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

చింతపల్లి, జి.మాడుగుల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. సోమవారం చింతపల్లి మండలం అన్నవరంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శులు కొట్టగుళ్లి సుబ్బారావు, కిల్లు రమేష్‌నాయుడు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. వైకాపా పాలనకు కాలం చెల్లిందన్నారు. వైకాపాలో కీలకంగా పనిచేసిన గొర్లె కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. వారందరికీ ఈశ్వరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, నాయకులు బేరా సత్యనారాయణ, కిముడు లక్ష్మయ్య, పార్వతీపడాల్‌, సోమేష్‌, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.బీ జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ రామచంద్రపాలెం, సంగంబంద నుంచి పలువురు గ్రామస్థులు తెదేపాలో చేరారు. పాడేరులో జరిగిన కార్యక్రమంలో గిడ్డి ఈశ్వరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ సర్పంచి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని