logo

పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా

కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు.

Published : 08 May 2024 01:43 IST

అరకు ఎంపీ అభ్యర్థిని గీత

పెదభీంపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ-1 వద్ద నిర్వాసితుల సమస్యలు వింటున్న ఎంపీ అభ్యర్థి గీత

దేవీపట్నం, గంగవరం, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌, గంగవరం మండలం మొల్లేరు పంచాయతీల్లో ఆమె మంగళవారం పర్యటించారు. రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు వైకాపా ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.పది లక్షలు ఇస్తామని మోసం చేసిందన్నారు. గిరిజనులు, గిరిజనేతరులను మోసం చేసిన  ఒక సైకో రంపచోడవరంలో ఉన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి గెలుపుతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారమవుతాయన్నారు. పెదభీంపల్లి పునరావాస కాలనీ-1లో ముంపు గ్రామాలైన డి.రావిలంక, పరగసానిపాడు, బోడిగూడెం నిర్వాసితులు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీత ఎదుట మొరపెట్టుకున్నారు. ఇందుకూరు-1 ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఆమె పర్యటించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగవరం మండల తెదేపా, జనసేన అధ్యక్షులు పాము అర్జున్‌, కుంజం సిద్ధు తదితరులు పాల్గొన్నారు.


తెదేపాలో చేరికలు

రాజేశ్వరి, శిరీషాదేవి సమక్షంలో తెదేపాలోకి చేరుతున్న నిమ్మలగూడెం గ్రామస్థులు

చింతూరు: మండలంలోని నిమ్మలగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు 242 కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి,  తెదేపా నేతలు ఇల్లా చిన్నారెడ్డి,  జమాల్‌ఖాన్‌,  సోడె శ్రీనివావు తదితరులు పాల్గొన్నారు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని