logo

మట్టి పోసి వదిలేశారు..

రహదారులు వేస్తామని మట్టిపోసి వదిలేశారు. రోడ్లు వేయకుండా సామగ్రిని ఎలా తీసుకెెళ్లాలి?, ఇల్లు ఎలా కట్టుకోవాలి? చినకు పడితే చిత్తడిగా ఉంటోందని పులిగడ్డ పంచాయతీలోని పాతకోట జగనన్న కాలనీని శనివారం సందర్శించిన గృహ నిర్మాణ సంస్థ డీఈఈ భానోజీరావును లబ్ధిదారులు ప్రశ్నించారు.

Published : 27 Nov 2022 05:12 IST

రహదారులు లేకుండా ఇల్లు ఎలా కట్టుకోవాలి
పాతకోటలో డీఈఈని ప్రశ్నించిన లబ్ధిదారులు

జగనన్న కాలనీలో అంతర్గత రహదారిపై ఇలా..

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారులు వేస్తామని మట్టిపోసి వదిలేశారు. రోడ్లు వేయకుండా సామగ్రిని ఎలా తీసుకెెళ్లాలి?, ఇల్లు ఎలా కట్టుకోవాలి? చినకు పడితే చిత్తడిగా ఉంటోందని పులిగడ్డ పంచాయతీలోని పాతకోట జగనన్న కాలనీని శనివారం సందర్శించిన గృహ నిర్మాణ సంస్థ డీఈఈ భానోజీరావును లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న కాలనీలో 62 మందికి నివేశన స్థలాలు కేటాయించగా 52 మందికే ఇళ్ల  నిర్మాణాలకు అనుమతులు లభించాయి. కాలనీలో రహదరాల నిర్మాణాలకు ఇటీవల మట్టిని తరలించారు. మట్టిగుట్టలతో కొన్ని రహదారులను నింపారని.. ఇంటి సామగ్రిని తరలించడానికి ఇబ్బందికరంగా ఉందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని