logo

ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ, వారిలో దాగున్న నైపుణ్యాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) 2022 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 12 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.  

Published : 01 Dec 2022 06:12 IST

గుణదల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ, వారిలో దాగున్న నైపుణ్యాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) 2022 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 12 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా ప్రతాలు, రివార్డులను అందజేశారు. ఇందులో మొదటి బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ రూ.60 వేలు, తృతీయ రూ.30 వేలు, చతుర్థ బహుమతికి రూ.10 వేలు నగదు చెక్కులను అందజేశారు.
సామాజిక సేవా విభాగంలో షేక్‌ ఖాజీపూర్‌ అజరుద్దీన్‌ (వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), ప్రభావవంతమైన విద్యార్థి పురస్కారం విభాగంలో  (ఇన్‌ఫ్లూయెన్షియల్‌ స్టూడెంట్‌) మేడిశెట్టి సాయికిరణ్‌ (ఆంధ్రా లయోలా కాలేజ్‌), అన్నపురెడ్డి హర్షిత (లక్కిరెడ్డి బాల్‌రెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌), ఉత్తమ విద్యార్థి విభాగంలో కె.మేఘన (ఆంధ్రా లయోలా కాలేజ్‌) అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని