logo

నిందితుల ఆచూకీకి ప్రత్యేక బృందాలు

మండలంలోని నడుపూరులో మచిలీపట్నం-గుడివాడ ప్రధాన రహదారిపై మంగళవారం జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ముగ్గురిపై హత్యాయత్నానికి దారితీసిన నేపథ్యంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏడుగురు కార్యకర్తలపై ఐపీసీ సెక్షన్‌ 307, ఎస్సీ ఎస్టీ కుల వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం పాఠకులకు విదితమే.

Published : 19 Jan 2023 05:49 IST

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని నడుపూరులో మచిలీపట్నం-గుడివాడ ప్రధాన రహదారిపై మంగళవారం జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ముగ్గురిపై హత్యాయత్నానికి దారితీసిన నేపథ్యంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏడుగురు కార్యకర్తలపై ఐపీసీ సెక్షన్‌ 307, ఎస్సీ ఎస్టీ కుల వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం పాఠకులకు విదితమే. సంఘటన అనంతరం నిందితులందరూ పరారవడంతో ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పెడన సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ చెప్పారు. సర్కిల్‌ పరిధిలోని ముగ్గురు ఎస్సైలు ఈ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొఠారి మల్లిబాబు, శింగంశెట్టి అశోక్‌కుమార్‌, మద్దాల నాగ వెంకట పవన్‌లు కోలుకుంటున్నట్లు సీఐ తెలిపారు.

వైకాపా ఖండన: పెడన నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు రాజకీయ దాడులు జరిగిన సంఘటనలు లేవని, తొలిసారిగా నడుపూరు కేంద్రంగా ముగ్గురిపై జరిగిన హత్యాయత్నాన్ని వైకాపా తీవ్రంగా ఖండిస్తోందని ఆపార్టీ పెడన మండల కన్వీనర్‌ కొండవీటి నాగబాబు, పెనుమల్లి సర్పంచి గరికపాటి రామానాయుడులు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై త్వరితగతిన ఛార్జిషీట్లు నమోదుచేసి కఠిన శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని