logo

రాష్ట్ర స్థాయి క్రీడలకు ఏర్పాట్లు

స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి  పాలిటెక్నిక్‌ కళాశాలల క్రీడల, ఆటల పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది.

Published : 01 Feb 2023 05:04 IST

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి  పాలిటెక్నిక్‌ కళాశాలల క్రీడల, ఆటల పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కార్యదర్శి కె.విజయభాస్కర్‌, సంయుక్త కార్యదర్శి ఎ.జానకిరామ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ కె.లక్ష్మీపతి, ఆర్జేడీలు జె.సత్యనారాయణమూర్తి (కాకినాడ), ఎ.నిర్మలకుమార్‌ ప్రియ (తిరుపతి) మంగళవారం మైదానాన్ని పరిశీలించి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.విజయసారథికి పలు సూచనలు చేశారు. అనంతరం విజయభాస్కర్‌ మాట్లాడుతూ అథ్లెటిక్స్‌ పోటీలను స్థానిక ఆంధ్రా లయోలా కళాశాల ప్రాంగణంలో, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలను  పీబీ సిద్ధార్థ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో, మిగిలినవి పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగతాయని వెల్లడించారు. పలువురు క్రీడాకారులు ప్రాంగణానికి చేరుకున్నారని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని