logo

ఆరోగ్యకర అలవాట్లు అలవరచుకోవాలి

చిన్నారులందరూ ఆరోగ్యకర అలవాట్లు  అలవరచుకోవడం అత్యంత అవసరమని పర్యావరణవేత్త, అవార (అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌ సంఘం) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ పిలుపునిచ్చారు.

Published : 06 Feb 2023 05:37 IST

నదీతీరాన అరటి ఆకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాధిక, భార్గవి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: చిన్నారులందరూ ఆరోగ్యకర అలవాట్లు  అలవరచుకోవడం అత్యంత అవసరమని పర్యావరణవేత్త, అవార (అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌ సంఘం) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ పిలుపునిచ్చారు. ఆదివారం వేకువనే కృష్ణానదీ తీరాన రాజధాని గ్రామ పరిసరాల్లో జరిగిన ప్రకృతిలో పిల్లల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణం, సామాన్య ప్రజాజీవితం అస్తవ్యస్తమయ్యే సంకేతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇటీవల ఈత శిక్షణ పూర్తిచేసిన సాధారణ గృహిణి రాధిక (పెదవడ్లపూడి), స్విమ్మర్‌ భార్గవిలు నదీ తీరాన పరుగు ప్రారంభించారు. ఆటపాటల తర్వాత నదీ నిడివి ఈత కార్యక్రమాన్ని ఆత్మారామ్‌ ఆరంభించారు. కార్యక్రమాలను ఉపాధ్యాయిని షరన్‌ సమన్వయ పరిచారు. ప్రతి ఆదివారం నిరంతరం జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి 94941 26812 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని