logo

మద్యం సీసాలతో దొరికిన వైకాపా నాయకుడు

ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ, అక్రమంగా మద్యం తరలిస్తున్న వైకాపా సోషల్‌ మీడియా సహ సమన్వయకర్తను సోమవారం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరులో చోటుచేసుకుంది.

Published : 07 Feb 2023 03:26 IST

గొలుసు దుకాణాలకు సరఫరా బట్టబయలు

మైలవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ, అక్రమంగా మద్యం తరలిస్తున్న వైకాపా సోషల్‌ మీడియా సహ సమన్వయకర్తను సోమవారం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరులో చోటుచేసుకుంది. వివరాలు... జి.కొండూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వైకాపా నాయకుడు పజ్జూరు శ్రీకాంత్‌ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గొలుసు దుకాణాలకు మద్యం సీసాలను అధిక ధరకు సరఫరా చేస్తున్నాడన్న సమాచారంతో సోమవారం ఎక్సైజ్‌ విజిలెన్స్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ నేతృత్వంలో బృందం రహస్యంగా దుకాణానికి చేరుకుంది. ఆ సమయంలో దుకాణం నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 65 మద్యం సీసాలు ఇస్తుండటం గమనించిన బృందం  పట్టుకుంది. కొనుగోలుదారుడు జి.కొండూరుకు చెందిన గొలుసు దుకాణం నిర్వహకుడు నాగరాజుగా తేలింది. ఒక్కో సీసాపై రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేసి శ్రీకాంత్‌ తన జేబులో వేసుకుంటునట్లు బయటపడింది. మద్యం సీసాలతో కలిపి ఇద్దరిని మైలవరం ఎస్‌ఈబీ స్టేషన్‌కు తరలింంచారు. అక్రమంగా అమ్మిన మద్యం సీసాల విలువ రూ.9 వేలు ఉంటుందని ఎస్‌ఈబీ సీఐ పి.గిరిజ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అధికార పార్టీ ముసుగులో అక్రమార్జనకు తెరలేపి గొలుసు దుకాణాలకు కావాల్సినంత మద్యం నియోజకవర్గవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని