logo

ప్రధానోపాధ్యాయుడిపై ఉపాధ్యాయిని దాడి!

ప్రభుత్వ పాఠశాలలోని కంప్యూటర్‌ వినియోగమై తలెత్తిన వివాదంలో హెచ్‌ఎమ్‌పై ఉపాధ్యాయిని దాడికి పాల్పడిందంటూ హెచ్‌ఎం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు పంపిన వీడియో బుధవారం వైరల్‌గా మారింది.

Published : 09 Feb 2023 01:12 IST

వీరపనేనిగూడెం(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలోని కంప్యూటర్‌ వినియోగమై తలెత్తిన వివాదంలో హెచ్‌ఎమ్‌పై ఉపాధ్యాయిని దాడికి పాల్పడిందంటూ హెచ్‌ఎం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు పంపిన వీడియో బుధవారం వైరల్‌గా మారింది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. గన్నవరం మండలం వీరపనేనిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న శివకుమారి.. పాఠశాలలో అందివ్వాల్సిన వ్యక్తిగత ధ్రువపత్రాల ప్రింట్‌ విషయమై హెచ్‌ఎం వెంకటేశ్వరరావుతో వివాదం తలెత్తింది. అది తారా స్థాయికి చేరడంతో ఉపాధ్యాయిని శివకుమారి చెప్పుతో తనపై దాడికి పాల్పడినట్లు హెచ్‌ఎం ఉన్నతాధికారులకు వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. మరోవైపు గతకొంత కాలంగా తనను కావాలనే మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు హెచ్‌ఎం వెంకటేశ్వరరావుపై శివకుమారి ఆత్కూరు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై సూర్యశ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని