logo

ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా

Published : 23 Apr 2024 06:38 IST

ఎస్‌బీఐ వద్ద భవాని గ్రూపు సభ్యుల నిరసన

ఎస్‌బీఐ వద్ద నిరసన తెలుపుతున్న గ్రూపు సభ్యులు

పెనమకూరు (తోట్లవల్లూరు), న్యూస్‌టుడే: గ్రూపు సభ్యులందరూ రాకుండా రుణం డబ్బులు ఎలా ఇచ్చారని బ్యాంకు అధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తున్నారని భవాని గ్రూపు సభ్యులు టి.లక్ష్మీ నాగభూషణమ్మ, టి.మల్లేశ్వరి తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘ సభ్యులతో కలిసి వారు సోమవారం ఎస్‌బీఐ వద్ద నిరసన తెలిపారు. అనంతరం బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రూపు సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్‌రావు మాట్లాడుతూ.. ఆగస్టు 2021లో భవాని గ్రూపులోని అధ్యక్షురాలు, కార్యదర్శి, సీసీ, ఏపీఎం, బ్యాంకు వారు కలిసి గ్రూపు సభ్యుల తీర్మానం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో లోన్‌ డబ్బులు తీసుకున్నారన్నారు. రెండున్నరేళ్లుగా క్రమ తప్పకుండా ప్రతి నెల రూ.3500 కట్టినా..రెండేళ్ల నుంచి మీ గ్రూపు వారు సక్రమంగా డబ్బులు కట్టండం లేదని బ్యాంకువారు ఇప్పుడు చెబుతున్నారని వాపోయారు. మేము కూలీ పనులు చేసుకుని మరీ ప్రతినెల అధ్యక్షురాలికి కట్టామని తెలిపారు. తీరా బ్యాంకు అధికారులు ఇప్పుడు కట్టలేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా డబ్బులు చెల్లించనప్పుడు గ్రూపు సభ్యులందరికి ఇన్ని నెలలు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్మిక సంఘ నాయకులు జుజ్జువరపు యేసు, గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

మినిట్‌ బుక్‌లో ఫోర్జరీ సంతకాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని