logo

గుడివాడ పసుపుమయం

గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌కు జనం తరలి వచ్చారు.

Published : 24 Apr 2024 03:38 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌కు జనం తరలి వచ్చారు. తొలుత ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామపత్రం దాఖలు చేశారు. జిల్లా బీసీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, భాజపా నియోజకవర్గ కన్వీనర్‌ దావులూరి సురేంద్రబాబు గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల తెదేపా, జనసేన, భాజపా నాయకులు వేలాదిగా పాల్గొన్నారు. గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కేరళ డప్పు వాయిద్యాలతో పట్టణం మార్మోగింది.


నామినేషన్‌కు తరలిన కూటమి శ్రేణులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: తెదేపా కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌ సందర్భంగా మంగళవారం భారీగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి ఆటోలు, వ్యాన్లు, ద్విచక్రవాహనాలపై జెండాలు చేతబట్టి జై తెలుగుదేశం, జైజై చంద్రబాబు అంటూ నినదిస్తూ ఎండను సైతం లెక్కచేయకుండా గుడివాడకు వెళ్లారు. రాష్ట్ర కార్యదర్శి శాయన పుష్పావతి, కొసరాజు బాపయ్యచౌదరి, మోహన్‌రావు, వల్లభనేని వెంకట్రావ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని