logo

ఫెసిలిటేషన్‌ కేంద్రాల సంఖ్య పెంపు

ద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్‌, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated : 06 May 2024 03:04 IST

9,636 మంది ఉద్యోగుల ఓటు వినియోగం

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్‌, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో (శని, ఆదివారాల్లో) మొత్తం 9,636 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ (ఐజీఎం) స్టేడియంలోని కేంద్రీకృత ఫెసిలిటేషన్‌ కేంద్రంలో రెండు రోజుల్లో 2,954 మంది పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించున్నట్టు తెలిపారు. తొలి రోజు 1198, రెండో రోజు 1756 మంది ఓటు వేసినట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని