logo

ఫారం-12 అందజేతకు మరో అవకాశం

పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 06 May 2024 02:55 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తూ.. ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న వారు ఈ నెల 7 లేదా 8 తేదీల్లో వెళ్లి ఓటు ఉన్న నియోజకవర్గ ఆర్వో పరిధిలోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఫారం-12 అందజేసి, పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు. ఉదాహరణకు ఇప్పటి వరకు ఫారం-12 ఇవ్వని వారు.. తమ ఓటు బాపట్లలో ఉంటే 7 లేదా 8 తేదీల్లో అక్కడికి వెళ్లి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. దీనికోసం డ్యూటీ ఆర్డర్‌ తీసుకెళ్లాలని, తాను ఇంత వరకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేయలేదని ఆర్వో వద్ద రుజువు చేసుకోవాల్సి ఉందన్నారు. ఒక వేళ ఎన్టీఆర్‌ జిల్లాలోనే విధులు కేటాయించడం, ఓటు హక్కు కూడా ఇక్కడే ఉండి, ఫారం-12 సమర్పించని వారు.. సంబంధిత నియోజకవర్గ ఆర్వో వద్దకు వెళ్లి సదరు ఫారాన్ని అందజేసి, పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగం కోసం ప్రభుత్వం ఒక రోజు క్యాజువల్‌ లీవ్‌ను మంజూరు చేసినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని