logo

సీఎం పర్యటనకా? పోస్టల్‌ బ్యాలట్‌కా?

పోస్టల్‌ బ్యాలట్‌ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్‌కు 6వ తేదీ కేటాయించారు.

Published : 06 May 2024 03:07 IST

తలలు పట్టుకుంటున్న పోలీసులు

పెనమలూరు, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్‌కు 6వ తేదీ కేటాయించారు. ఇదే తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాకు వస్తుండడంతో ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారికి ఇబ్బంది ఎదురైంది. ఇతర జిల్లాల్లో ఓటున్న పోలీసులకు మచిలీపట్నంలో పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించగా.. పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నవారికి పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు కేటాయించారు. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా సిబ్బంది, అధికారులు బందోబస్తుకు వెళ్లాల్సి రావడంతో వీరంతా ఓటు హక్కు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొనే అధికారులు, సిబ్బందికి కనీస సమయం నాలుగు గంటలు పడుతుంది. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తును పూర్తి చేసుకొని ఓటు హక్కు వినియోగించుకొనే సమయం ఉంటుందా? ఉండదా? లేక మరోరోజు తమకు వకాశాన్ని కల్పిస్తారా? అన్న సందేహం వీరిలో ఏర్పడుతోంది. పెనమలూరు నియోజకవర్గంలో 130 మంది వరకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది సోమవారం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని