logo

ఉట్టిపడిన సంప్రదాయం

రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

Published : 06 May 2024 04:30 IST

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 116 గేయాలు ఆలపించిన ఫీమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా పద్మశ్రీ రెండు ప్రపంచ రికార్డులు సాధించడం గొప్ప విషయమని వక్తలు కొనియాడారు.

ఆమెకు హై రేంజ్‌ ఆఫ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు, ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు అనే ప్రపంచ రికార్డును జస్టిస్‌ వి.ఆర్‌.కె.కృపాసాగర్‌, గుంటూరు-2వ అడిషనల్‌ జిల్లా జడ్జి వి.ఎ.ఎల్‌.సత్యవతిల చేతుల మీదుగా ప్రదానం చేశారు. కాగా.. కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్‌ ట్రెడిషనల్‌ ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌ ఫినాలే అంగరంగ వైభవంగా సాగింది. విజేతలకు మిస్‌ విజయవాడ, టీవీ నటి   శ్రీసత్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, స్వరలయ సెక్రటరీ ఎస్‌.ఆర్‌.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని