logo

నగరంలో రెడ్‌ జోన్‌ అమలు

ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్‌జోన్‌ (నో ఫ్లయింగ్‌ జోన్‌)గా ప్రకటించారు.

Published : 07 May 2024 05:41 IST

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు
5 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ భద్రత

విజయవాడ నేరవార్తలు: ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్‌జోన్‌ (నో ఫ్లయింగ్‌ జోన్‌)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తీసుకుంటారు.  ప్రధాని  మోదీ గన్నవరం విమానాశ్రయం నుంచి పి.వి.పి.మాల్‌ వద్దకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల దూరం రోడ్‌షో నిర్వహిస్తారు. శాంతిభద్రతల విభాగం, ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను మోహరించారు. మొత్తం 5వేల మందితో రూట్‌ బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్‌షో ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరియా డామినేషన్‌, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీస్‌, కట్‌ ఆఫ్‌ పార్టీస్‌, రూఫ్‌ టాప్స్‌, రోప్‌ పార్టీస్‌, యాంటీ సబోటేజ్‌ చెక్‌ బృందాలను నియమించారు.  

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ సోమవారం ఉదయం తన కార్యాలయంలో ప్రధాని పర్యటన భద్రతపై సమీక్ష నిర్వహించారు. రెడ్‌జోన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. ఐజీపీ కె.వి.మోహన్‌రావు, డీఐజీ గోపీనాథ్‌జెట్టీ, ఏఐజీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, వకుల్‌ జిందాల్‌, మల్లికా గార్గ్‌, ఎ.ఆర్‌.దామోదర్‌, డీసీపీలు కె.శ్రీనివాసరావు, అధిరాజ్‌సింగ్‌ రాణా, ఉదయరాణి, కరీముల్లా షరీఫ్‌, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, బి.రామకృష్ణ ఇతర అధికారులతో కలిసి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని