logo

మహిళలకు నెలకు రూ.1500

మహిళలకు సూపర్‌ - 6లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.1500తో మేలు కలుగుతుందని అవనిగడ్డ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 08 May 2024 04:41 IST

అవనిగడ్డ, అవనిగడ్డ, గ్రామీణం, ఘంటసాల, మోపిదేవి, నాగాయలంక న్యూస్‌టుడే: మహిళలకు సూపర్‌ - 6లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.1500తో మేలు కలుగుతుందని అవనిగడ్డ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

  • కూటమి అభ్యర్థులైన బుద్ధప్రసాద్‌, బాలశౌరి విజయాన్ని అంకాంక్షిస్తూ జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు వేకనూరులో మండలి కుమార్తె సూర్యప్రభ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 
  • ఎండకుదురు పంచాయతీ జీలగలగండికాలనీలో బుద్ధప్రసాద్‌ కుమార్తె అవనిజ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మి, పలువురు తెదేపా, జనసేన నాయకులు ఇంటింటికీ వెళ్లి సూపర్‌-6 కరపత్రాలు పంపిణీ చేశారు.
  • మెరకనపల్లిలో మండలి అల్లుడు శీలం ఆశ్విన్‌ తెదేపా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • బుద్ధప్రసాద్‌ కుటుంబ సభ్యులు కూటమి నాయకులతో కలిసి భావదేవరపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • మండలి పెద్ద కుమార్తె శీలం కృష్ణప్రభ అవనిగడ్డ రెండో వార్డులో, మండలి సాయి సుప్రియ నరసింహపురంలో తెదేపా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ -6 కరపత్రాలు పంపిణీ చేశారు.  

జనసేనలో చేరికలు

అవనిగడ్డ సింహాద్రి కాలనీ యువత, కోడూరు మండలం, ఉల్లిపాలేనికి చెందిన వైకాపా నాయకులు బుద్ధప్రసాద్‌ సమక్షంలో జనసేనలో చేరారు. వీరికి మండలి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా పాలనలో అభివృద్ధి లేకపోవడంతో పార్టీ మారుతున్నట్లు వారు తెలిపారు. 20 కుటుంబాల వారు చేరిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు