logo

గాలివాన బీభత్సం

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Published : 08 May 2024 04:53 IST

కూలిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
అంధకారంలో పల్లెలు, పట్టణాలు

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం, పామర్రు గ్రామీణం, గుడ్లవల్లేరు, మోపిదేవి: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుడివాడలో రెండు గంటలపాటు జనజీవనం స్తంభించింది. ఏలూరు, బంటుమిల్లి, బస్‌స్టాండ్‌ రోడ్డుల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. బస్‌స్టాండ్‌ జలమయమైంది.  ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరీదు వారి వీధి, రైల్వేస్టేషన్‌ రోడ్డులో విద్యుత్తు నియంత్రిక, స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 9గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

  • పామర్రు మండలం కొమరవోలు ప్రధాన రోడ్డుపై తాటిచెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొండిపర్రు పరిసర ప్రాంతంలో భారీ వృక్షం కూలిపోయింది. కొమరవోలు, జమీగొల్వేపల్లి, నెమ్మలూరు, కనుమూరు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్తు తీగలు తెగడంతో సరఫరా నిలిచిపోయింది.
  • అంగలూరు వద్ద ఎంఎన్‌కే రహదారిపై తాటిచెట్టు రోడ్డుకు అడ్డంగా సగానికి కూలిపోయింది. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, కౌతవరం ఒకటో వార్డు రైస్‌మిల్‌ సమీపంలో ఎంఎన్‌కే రహదారికి అడ్డంగా భారీ చెట్టుకొమ్మలు తెగి పడ్డాయి. పలు వీధుల్లో నీరు నిలిచి కాల్వలను తలపించాయి. పది రోజులుగా వీస్తున్న వడగాల్పులకు అల్లాడుతున్న జనం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో సంతోషపడుతున్నారు. మోపిదేవిలో కూడా వర్షానికి జనజీవనం స్తంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు