logo

కనుల పండువగా అమరావతి నృత్యోత్సవం

నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతి నృత్యోత్సవం-2021 కార్యక్రమం శనివారం మొగల్రాజుపురం సిద్ధార్థ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఒడిశాకు చెందిన ప్రఖ్యాత

Published : 05 Dec 2021 04:56 IST


కాశ్మీరా త్రివేది బృందం నృత్య ప్రదర్శన

విజయవాడ సాంస్కృతికం: నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతి నృత్యోత్సవం-2021 కార్యక్రమం శనివారం మొగల్రాజుపురం సిద్ధార్థ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఒడిశాకు చెందిన ప్రఖ్యాత కూచిపూడి నాట్యనిపుణురాలు పద్మశ్రీ ఇలియానా సితారిస్ట్‌ నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆమెకు అమరావతి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. మహారాష్ట్రకు చెందిన భరతనాట్య నిపుణురాలు కాశ్మీరా త్రివేది బృందం నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆహూతుల్ని ఆకట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన గీతా నారాయణ్‌ తన కూచిపూడి నాట్యంతో రంజింపజేశారు. అసోంకు చెందిన జితూ బోరా బృందం ప్రదర్శించిన బిహూ నృత్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. తంగిరాల అన్నపూర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని