logo
Published : 02/12/2021 06:13 IST

పరిహారం ఇప్పించాలని..1,810 దరఖాస్తుల అందజేత

దరఖాస్తులను పరిశీలిస్తున్న కలెక్టరేట్‌ సిబ్బంది

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులు పరిహారం కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందిస్తున్నారు. తొలి, రెండో దశల్లో కరోనా మహమ్మారితో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మృత్యువాత పడ్డారు. బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు కలెక్టరేట్‌ ఆవరణలో అక్టోబరు 29న ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. నవంబరు 30 నాటికి 1810 దరఖాస్తులు అందాయి. ఇందులో 1741 దరఖాస్తులను సి-డాక్‌ సంఖ్య, ఐసీఎంఆర్‌ ధ్రువీకరణ కోసం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపించారు. నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని డీఆర్వో గాయత్రీదేవి తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి రూ.50 వేల చొప్పున పరిహారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దరఖాస్తుల దాఖలుకు తుది గడువు లేదని చెప్పారు.

ఒకే మృతికి మూడు..: కలెక్టరేట్‌లోని కేంద్రం నుంచి దాదాపు 3 వేలకుపైగా ఖాళీ దరఖాస్తులను బాధిత కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ఒకే మృతికి రెండు మూడు దరఖాస్తులు దాఖలు కావడం విశేషం. ఈ తరహా దరఖాస్తులు వంద దాకా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఇస్తున్నారు. దీంతో ఎవరికి పరిహారం చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటి దరఖాస్తులకు తహసీల్దార్లకు పంపించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరణాల నమోదుపై సందేహాలు

కొవిడ్‌ తొలి, రెండో దశలో మృతి చెందిన వారు 1093 మందేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తొలి విడతలో మరణాలు పక్కాగా నమోదయ్యాయి. రెండో విడత ఇళ్ల వద్ద, ఆస్పత్రుల ఓపీల్లోనే అనేక మంది మృతి చెందారు. ఇవన్నీ లెక్కలోకి రాలేదు. తాజాగా దరఖాస్తుల సంఖ్యను చూస్తే మరణాల సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని