logo

మానవత్వం చాటిన సీటీటీఐ

రైలులో విధులు నిర్వహిస్తున్న చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున యశ్వంతపూర్‌ - గొరఖ్‌పూర్‌ రైలులో చోటుచేసుకుంది. అయోధ్యకు చెందిన హరీష్‌పాండే, గర్భిణి అయిన ఇతని భార్య సీమా

Published : 05 Dec 2021 04:48 IST

ఆసుపత్రిలో క్షేమంగా ఉన్న సీమా, బాలుడిని లాలిస్తున్న సీటీటీఐ సతీమణి

గుంతకల్లు, న్యూస్‌టుడే: రైలులో విధులు నిర్వహిస్తున్న చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున యశ్వంతపూర్‌ - గొరఖ్‌పూర్‌ రైలులో చోటుచేసుకుంది. అయోధ్యకు చెందిన హరీష్‌పాండే, గర్భిణి అయిన ఇతని భార్య సీమా రైలులో ప్రయాణిస్తున్నారు. సీమాకు పురిటినొప్పులు రావడంతో డోన్‌కు చెందిన ధర్మవరం డిపోలో పని చేస్తున్న చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రయ్య, మరో రైల్వే ఉద్యోగి అబ్దుల్‌ రవూఫ్‌ డోన్‌లో రైలును ఆపారు. విధులు ముగించుకున్న సీటీటీఐ ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. సీటీటీఐతో పాటు ఆయన సతీమణి ఆసుపత్రికి వెళ్లి సీమాకు అవసరమైన ఆహారాన్ని, దుప్పట్లను అందజేశారు. వారికి భార్యాభర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని