logo

రైతుల దాతృత్వం.. వంతెన నిర్మాణం

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంలో ఉండే పోతులనాగేపల్లి-కనంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నది ప్రవహిస్తోంది. గతేడాది వచ్చిన వరదలకు ఈ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు ఆగిపోయాయి.

Published : 08 Feb 2023 06:20 IST

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంలో ఉండే పోతులనాగేపల్లి-కనంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నది ప్రవహిస్తోంది. గతేడాది వచ్చిన వరదలకు ఈ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు ఆగిపోయాయి. కనంపల్లి నుంచి పోతులనాగేపల్లికి వచ్చి అక్కడి నుంచి ధర్మవరానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే గ్రామస్థులు ఈ వంతెన ధ్వంసం కావటంతో సుమారు 10కిలోమీటర్లు చుట్ట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ప్రభావం తగ్గిన తరువాత దాదాపు 5 నెలలుగా చిత్రావతి నది నీటిలోనే వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, ప్రమాదకరంగా రాకపోకలు సాగించేవారు. తాత్కాలికంగ వంతెన నిర్మించాలని గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. వారి నుంచి స్పందన కరవైంది. ముఖ్యంగా వెద్యసేవలు అందటం కష్టతరంగా మారడంతో ఇరుగ్రామాల ప్రజలు చందాలు వేసుకుని సుమారు రూ.2 లక్షలు పోగు చేశారు. ఆ నిధులతో పెద్దపెద్ద సిమెంటు పైపులు వేసుకుని దానిపైన మట్టిపోసి చదును చేసుకుని తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామాల మధ్య రహదారి, వంతెన నిర్మాణానికి టెండర్ల దశలో పనులు ఆగిపోయాయి. పాలకులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, ధర్మవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని