logo

Balakrishna: ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధిస్తా: నందమూరి బాలకృష్ణ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని, ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్యనిషేధం అమలు చేయక కొత్తబ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు.

Updated : 08 Apr 2024 09:10 IST

సమావేశంలో మాట్లాడుతున్న బాలకృష్ణ, బీకే పార్థసారథి, నాయకులు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని, ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్యనిషేధం అమలు చేయక కొత్తబ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక జేవీఎస్‌ ప్యాలెస్‌లో తెదేపా, భాజపా, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని, ఇలాంటి రాష్ట్రానికి సమర్థమైన పాలన అందించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే చంద్రబాబునాయుడి ద్వారానే సాధ్యమని అన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తాను హ్యాట్రిక్‌ సాధిస్తానన్నారు. త్వరలో జరిగే ఎన్నికలు మహా సంగ్రామం లాంటివని అందువల్ల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. నా అక్కాచెల్లెళ్లు అంటూ సొంత చెల్లెళ్లకే అన్యాయం చేశాడన్నారు. సమావేశంలో హిందూపురం పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి, జనసేన పార్టీ నాయకులు వరుణ్‌, ఆకుల ఉమేశ్‌, భాజపా నాయకులు ఆదర్శకుమార్‌, వరప్రసాద్‌ పాల్గొన్నారు. పార్టీ నాయకులు అనిల్‌కుమార్‌, డీఈ రమేశ్‌కుమార్‌, పరిమళ సమావేశంలో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని