logo

నమ్మండి.. జగనన్న కాలనీనే..

వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి.

Published : 24 Apr 2024 05:18 IST

న్యూస్‌టుడే, వజ్రకరూరు: వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి పునాది స్థాయిలో ఉన్నట్లు అధికారిక సమాచారం. ధర్మపురి గ్రామంలో 67 మందికి, కమలపాడు 68, చాబాల 178, గూళ్యపాళ్యం 104 మందికి జగనన్న కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. నాలుగేళ్లలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేకపోయింది. కనీసం కాలనీకి వెళ్లేందుకు దారి కూడా లేదు. లేఅవుట్‌లో ముళ్ల చెట్లు పెరిగాయి. కమలపాడు శివారులో గుంతకల్లు-కమలపాడు ప్రధాన రహదారి పక్కన లేఅవుట్‌లో పట్టాలు పంపిణీ చేసినా ఒక్క ఇంటిని కూడా ప్రభుత్వం నిర్మించలేదు. ఇక్కడ కూడా ముళ్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. పట్టాలు రద్దు చేస్తామని హౌసింగ్‌, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు లబ్ధిదారులను బెదిరించడంతో తట్రకల్లు, గంజికుంట, చిన్నహోతూరు గ్రామాల్లో పునాదులు వేసి వదిలివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని