logo

ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు

పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.

Published : 25 Apr 2024 05:18 IST

మాజీ మంత్రి పరిటాల సునీత

ప్రచారంలో మహిళలతో కలిసి సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రతులను ప్రదర్శిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

రామగిరి, న్యూస్‌టుడే: పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లి, కురుగుండ్లకాలనీ, పి.కొత్తపల్లి, పెద్దయ్యగారి కొట్టాల, దుబ్బార్లపల్లిలో గ్రామాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సునీతకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ ఎన్నికల మినీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు సునీత వివరించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, గతంలో చేసిన తప్పు చేయొద్దని తెలిపారు. పేరూరు డ్యాం వర్షాలతో నిండితే తామే నింపినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పేరూరు డ్యాంకు రూ.800 కోట్లు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయని తాము తిరిగి అధికారంలోకి వచ్చిన పనులు చేపడుతామని తెలిపారు. తెదేపా నాయకులు మాజీ ఎంపీపీ ఆంజనేయులు, తెదేపా నాయకులు రంగయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు. రామగిరికి చెందిన పలువురు వైకాపా శ్రేణులు బుధవారం పరిటాల సునీత సమక్షంలో తెదేపాలో చేరారు. వెంకటాపురంలో తెదేపా క్యాంపు కార్యాలయంలో వీరందరికీ సునీత కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు