logo

వైకాపాపై వ్యతిరేకత స్పష్టం: చింతామోహన్‌

సజావుగా పోలింగ్‌ నిర్వహించడంతో పోలీసు శాఖ విఫమైందని చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే అధికార పార్టీకి వత్తాసు పలికారని తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డా.చింతామోహన్‌ విమర్శించారు.

Published : 23 May 2024 01:44 IST

 మాట్లాడుతున్న చింతామోహన్‌

తిరుపతి (భవానీనగర్‌), న్యూస్‌టుడే: సజావుగా పోలింగ్‌ నిర్వహించడంతో పోలీసు శాఖ విఫమైందని చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే అధికార పార్టీకి వత్తాసు పలికారని తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డా.చింతామోహన్‌ విమర్శించారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికారులే వైకాపా డబ్బు పంపిణీ చేశారని దుయ్యబట్టారు. పోలింగ్‌లో ఓటర్ల చైతన్యం చూస్తే వైకాపా వ్యతిరేకత స్పష్టంగా కనిపించదని వివరించారు. రాష్టంలో జగన్‌కు, దేశంలో మోదీకి జూన్‌ 4న వ్యతిరేక తీర్పు రానున్నదని చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో డబ్బును ఓటర్లకు విచ్చలవిడిగా పంచుతున్నా పోలీస్‌ వ్యవస్థ మౌనం వహించిందన్నారు. యువత, మహిళలు ఓటేసేందుకు ఆసక్తి చూపారని వారికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి మంచి భవిష్యత్తు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని