logo

వాయుగుండంతో చేపల వేట నిషేధం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ నెల 12 వరకు సముద్రంలో వేట నిషేధించినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు చాంద్‌బాషా తెలిపారు.

Published : 07 Dec 2022 01:32 IST

తూపిలిపాలెం వద్ద అలల ఉద్ధృతి

వాకాడు, సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ నెల 12 వరకు సముద్రంలో వేట నిషేధించినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు చాంద్‌బాషా తెలిపారు. అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో మంగళవారం చలిగాలులు పెరిగాయి. సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా కనిపించింది. రెవెన్యూ, పోలీసు, మెరైన్‌ శాఖ అధికారులు తీరవాసులను అప్రమత్తం చేశారు. సూళ్లూరుపేట తహసీల్దార్‌ రవికుమార్‌ మండలస్థాయి అధికారులతో ముందస్తు చర్యలపై సమావేశం నిర్వహించారు. ఏవైనా ఘటనలు, సమస్యలు ఉంటే 98499 04074 నంబరుకు తెలియజేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని