logo

గ్రామాల మధ్య సరిహద్దుల్ని గుర్తించాలి

ఐరాల మండలంలోని కామినాయనిపల్లె, కుళ్లంపల్లె గ్రామాల సరిహద్దుల్ని సర్వే చేసి హద్దుల్ని గుర్తించాలని కుళ్లంపల్లె ఎస్సీ కాలనీ వాసులు విన్నవించారు.

Published : 21 Mar 2023 04:10 IST

కలెక్టరేట్‌కు వచ్చిన ఐరాల మండలం కుళ్లంపల్లె ఎస్సీ కాలనీ వాసులు

చిత్తూరు(సంతపేట): ఐరాల మండలంలోని కామినాయనిపల్లె, కుళ్లంపల్లె గ్రామాల సరిహద్దుల్ని సర్వే చేసి హద్దుల్ని గుర్తించాలని కుళ్లంపల్లె ఎస్సీ కాలనీ వాసులు విన్నవించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో ఉన్నతాధికారులకు విన్నవించారు. కుళ్లంపల్లెలోని గ్రామకంఠం భూముల్లో కామినా యనిపల్లెకు సంబంధించి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుతం ప్రహరీ నిర్మిస్తు న్నారని చెప్పారు. ఇరు గ్రామాల మధ్య సరిహద్దు విషయంలో గతంలో ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల హద్దుల్ని సర్వే చేయాలని ఆ వినతిలో పేర్కొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని