logo

రాస్‌ కేవీకే క్షేత్రంలో ఏనుగల విధ్వంసం

రాస్‌ కేవీకే వ్యవసాయ క్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు చొరబడి చెట్లను, పంటలను ధ్వంసం చేశాయి.

Published : 22 Mar 2023 03:52 IST

ఏనుగల దాడిలో ధ్వంసమైన మామిడిచెట్లు

రేణిగుంట, న్యూస్‌టుడే: రాస్‌ కేవీకే వ్యవసాయ క్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు చొరబడి చెట్లను, పంటలను ధ్వంసం చేశాయి. మంగళవారం ఇక్కడ పంటలను పరిశీలించిన రాస్‌ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాల వయస్సు ఉన్న మామిడిలో 250 మొక్కల వరకు ఏనుగుల వలన నష్టం కలిగిందన్నారు. ఎకరా వేరుశెనగ విత్తనోత్పత్తి క్షేత్రం, ఎకరా సంపంగి, 1.5 ఎకరాల మిరప, అర ఎకరం బంతి, టెంకాయి చెట్లకు ఏనుగులు గుంపు నష్టం కలిగించినట్లు తెలిపారు. వివిధ పంటలకు ఏర్పాటు చేసిన డ్రిప్‌ పైపులు, గేట్‌ వాల్వు, మోటార్లు, స్టార్టర్లను నాశనం చేశాయని, సుమారు రూ.2 లక్షల వరకు నష్టం ఉంటుందన్నారు. దెబ్బతిన్న పంటను అటవీశాఖ, వ్యవసాయాధికారులు సందర్శించి జరిగిన నష్టాన్ని అంచన వేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని