logo

విద్యావంతులైతేనే సమాజంలో గుర్తింపు

విద్యావంతులైతేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 03:13 IST

పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని ఆచార్య కొలకలూరి మధుజ్యోతికి అందించిన ముఖ్య అతిథులు

తిరుపతి(ఎస్వీయూ): విద్యావంతులైతేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్‌ కాకి మాధవరావు ‘సంకెళ్లను తెంచుకుంటూ’ పేరుతో రచించిన ఆత్మకథ పుస్తకాన్ని ఆయన శుక్రవారం ఎస్వీయూలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారిగా కీలకమైన పదవులను నిర్వహించిన కాకి మాధవరావు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లారన్నారు. ప్రభుత్వ పాలకుల ఆదేశాలను, సలహాలను, సూచనలను పాటిస్తూ పాలనారంగాన్ని ముందుకు తీసుకెళ్లడం ఐఏఎస్‌ అధికారులకు ఒత్తిడితో కూడుకున్న పని అని పేర్కొన్నారు. తన పదవీకాలంలో ఎదురైన సంఘటనలను, సమస్యలను ఏవిధంగా ఎదుర్కొన్నారో.. ఆత్మకథలో చక్కగా వివరించారని పేర్కొన్నారు. మాజీ సీఎస్‌ కాకి మాధవరావు మాట్లాడుతూ ఎదురైన ప్రతి సంఘటన తనకు ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టిందని, ఆ అనుభవాలతోనే సమాజాభివృద్ధికి కృషిచేశానన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తనవంతుగా పూర్తిస్థాయిలో కృషిచేశానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారులు సునీత, ప్రవీణ్‌కుమార్‌, ఆచార్య బాలాజీ, ఇంజినీర్‌ దినకరబాబు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని