logo

YS Jagan: ‘ఆ నలుగురు చాలు ఓడించేందుకు’.. ఎమ్మెల్యే కిలివేటితో సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి కలిశారు.

Updated : 25 Nov 2023 07:17 IST

ఈనాడు, తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) శుక్రవారం తాడేపల్లిలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. సూళ్లూరుపేట అభ్యర్థిత్వంపై చర్చకు వచ్చింది. సూళ్లూరుపేటలో డాక్టర్‌ గోపీనాథ్‌ గట్టి పోటీ ఇవ్వలేరని సత్యనారాయణరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలుగజేసుకున్న సీఎం.. గోపీనాథ్‌ అని ఎవరు చెప్పారన్నారు. సంజీవయ్యను సత్యవేడుకు పంపి, తిరుపతి ఎంపీ గురుమూర్తిని సూళ్లూరుపేటకు తీసుకురావాలని అన్నట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తనకు తమిళం రాదని చెప్పారు. నీకు తమిళం వచ్చని అనుకున్నానని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. నిన్ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారని అనగా.. నన్ను వ్యతిరేకిస్తున్నది నలుగురు మాత్రమేనని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. ఆ నలుగురు చాలు ఓడించేందుకు అని సీఎం అన్నట్లు సమాచారం. గెలిపించడం చాలా కష్టమని, ఓడించడం చాలా సులువు అని కూడా ఈ సందర్భంగా జగన్‌ అన్నారని తెలిసింది. చివరగా సీఎం వెళ్తూ.. ధనంజయరెడ్డిని మాట్లాడమని సూచించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు