logo

వైకాపాకు నిబంధనలు వర్తించవా..

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు.

Published : 07 May 2024 02:54 IST

పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఎంపీపీ

పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి వస్తున్న గుడుపల్లె ఎంపీపీ వరలక్ష్మి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. భద్రతా సిబ్బందికి ఆమె.. ఓటు ఉన్నట్లు చెప్పడంతో ఎటువంటి తనిఖీలు లేకుండా ఆమెను పంపారు. ఇదీ గమనించిన తెదేపా నాయకులు ఆమె గుడుపల్లె ఎంపీపీ అని ఆమెకు ఓటు ఎలా ఉంటుందని ప్రశ్నించడంతో సిబ్బంది పరుగున వెళ్లి ఆమెను వెనక్కి పంపారు. భద్రతా సిబ్బంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రం వద్దే ఇరు పార్టీలు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు వారిని వంద మీటర్ల దూరానికి పంపారు. ఈ సందర్భంలో ఈ ఘటన జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని