logo

మా పేర్లెక్కడ సారూ..!

ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది.

Updated : 07 May 2024 03:19 IST

రెండోరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాల వద్ద ఇదీ తీరు
గడువు పెంచినా పుత్తూరు కేంద్రంలో అనుమతి నిరాకరణ ?

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. ఇతర జిల్లాలో ఓటు కల్గి, చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది కోసం కలెక్టరేట్‌లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సౌకర్యం కల్పించారు. ఆదివారం కన్నా రద్దీ తక్కువగా ఉండటంతో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కలెక్టర్‌ షన్మోహన్‌ ఏర్పాట్లు పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేశారు.

  • చిత్తూరు పీవీకేఎన్‌ ప్రభుత్వ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, అత్యవసర సేవలకు చెందిన ఉద్యోగుల సేవల్ని వినియోగించుకున్నారు. ఆలస్యంగా ఉత్తర్వులు పొందిన వారి పేర్లు జాబితాలో కనిపించలేదు. దీంతో ఎన్నికల విధుల ప్రొసీడింగ్‌ కాపీ చూపి ఓటుహక్కు వినియోగించుకున్నారు ఉద్యోగులు. చిత్తూరు అసెంబ్లీ ఆర్వో, జేసీ శ్రీనివాసులు పోలింగ్‌ ప్రక్రియ పరిశీలించారు.
  • ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ఈ నెల 8 వరకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. నగరి నియోజకవర్గంలో పలువురికి ఓటు వినియోగానికి అధికారులు అనుమతివ్వలేదని సమాచారం. ఓటు వినియోగం కోసం పుత్తూరులో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల ప్రొసీడింగ్‌ కాపీతో వచ్చిన సిబ్బందిని.. ఓటు వేయడానికి అధికారులు అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈసీ ఆదేశాలు తమకేవీ అందలేదని అధికారులు చెప్పడంతో సిబ్బంది ఖంగుతిన్నారు.
  • ఎన్నికల విధుల నిమిత్తం కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు మంగళ, బుధవారాల్లోనూ అవకాశం ఉందని చిత్తూరు ఆర్వో, జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని