logo

‘ఎర్ర చందనం స్మగ్లర్‌ పేదవాడంట’

ఎర్రచందనం స్మగ్లర్‌, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ ధ్వజమెత్తారు.

Updated : 08 May 2024 07:17 IST

ప్రజలనుద్దేశించి మట్లాడుతున్న గురజాల, పక్కన దగ్గుమళ్ల, రాజసింహులు, హేమలత

చిత్తూరు (జిల్లా పంచాయతీ): ఎర్రచందనం స్మగ్లర్‌, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ ధ్వజమెత్తారు. మంగళవారం 2, 33, 34 వ డివిజన్లలో ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, తెదేపా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా సమావేశమైన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ చిత్తూరులో లాటరీ వ్యాపారం, పేకాట, గంజాయి విక్రయాలతో యువతను చిత్తు చేస్తున్నారని, దందాలు చేసే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే దోపిడీ తప్ప అభివృద్ధి, సంక్షేమం ఉండదన్నారు. మాజీ మేయర్‌ కఠారి హేమలతపై దాడి చేసి, ఆమెపైనే కేసులు పెట్టారని, మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టిన ఘనత అధికార పార్టీదని ఆరోపించారు. దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ప్రజల భూములు, ఆస్తులను తన ఆధీనంలో ఉంచుకునేందుకు సీఎం జగన్‌ కుట్ర చేశారన్నారు. తేనెబండలో పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత, నాయకులు ఎల్‌.బి.లోకేష్‌రెడ్డి, సీయంటీ త్యాగరాజన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని