logo
Published : 30/11/2021 06:29 IST

విద్యుత్తు సమస్యా.. వాట్సాప్‌ చేయండి

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో విద్యుత్తు సమస్యల సత్వర పరిష్కారం, మెరుగైన సేవల కోసం ఆటోమేటెడ్‌ ఛాట్‌ పేరుతో ఓ వాట్సాప్‌ నంబర్‌(85000 01912)ను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం సీఎండీ సంతోషరావు ఈ నంబర్‌ సేవలను ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వినియోగదారులు ఈ వాట్సాప్‌ నంబర్‌ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని, సేవలను పొందవచ్చని సీఎండీ తెలిపారు. ముందుగా ఈ నంబర్‌ను ఫోన్‌లో సేవ్‌ చేసుకుని వాట్సాప్‌లో హాయ్‌, హలో, స్టార్ట్‌ అని ఏదో ఒకటి టైప్‌ చేస్తే చాలు ఆ నెల విద్యుత్తు బిల్లు బకాయి, బిల్లు చెల్లింపు, నెలవారీ అంచనా బిల్లు, చెల్లించిన బిల్లు కాపీ, ఫిర్యాదుల నమోదు వంటి ఐచ్ఛికాలు కనిపిస్తాయి. వాటిలో వినియోగదారులకు కావాల్సినది ఎంచుకుని తగిన సేవలు పొందవచ్చన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని