logo
Published : 02/12/2021 06:33 IST

తీర రక్షణకు సహకరించాలి: ఎంపీ

కాకినాడ (బాలాజీచెరువు): తీర ప్రాంతం కోతకు గురికాకుండా, మత్స్యకారుల రక్షణకు ఎన్‌కోర్‌ (ఎన్‌హాన్సింగ్‌ కోస్టల్‌ అండ్‌ ఓషన్‌ రిసోర్స్‌ ఎఫీషియెన్సీ) ప్రాజెక్టు మంజూరు చేయాలని బుధవారం పార్లమెంట్‌లో కాకినాడ ఎంపీ వంగా గీత ప్రధాని మోదీని కోరారు. తీర ప్రాంత జనాభా స్థిరత్వం, వనరుల పరిరక్షణకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర కోత ఎక్కువగా ఉందన్నారు. ఉప్పాడ, కోనపాపపేట ప్రాంతాల వద్ద అలలు ఎగిసిపడి.. కడలి కోతకు గురవుతోందన్నారు. కాకినాడ-ఉప్పాడ రహదారి క్రమంగా కనుమరుగు అవుతోందని తెలిపారు. విపత్తుల సమయంలో ఆస్తి, ఇతర నష్టాలతో పాటు మానవ నష్టాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, దీనికి ఎన్‌కోర్‌ ప్రాజెక్టు ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాజెక్టు ఫేజ్‌-1 సదరు మంత్రిత్వ శాఖ వద్ద ఆమోదం పొందిందని, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం చేయాల్సి ఉందన్నారు. దీన్ని మంజూరు చేసి తీర ప్రాంత జనాభా, వనరులను రక్షించాలని కోరారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని