logo

ప్రతిష్టాత్మకంగా అంతర్వేది ఉత్సవాలు

భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్‌, ఆర్డీవో వసంతరాయుడు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరిగే అంతర్వేది ఉత్సవాల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై

Published : 21 Jan 2022 04:42 IST


మాట్లాడుతున్న ఆర్డీవో. వేదికపై ఉన్నతాధికారులు

అమలాపురం(గడియార స్తంభం): భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్‌, ఆర్డీవో వసంతరాయుడు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరిగే అంతర్వేది ఉత్సవాల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై గురువారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో డీఎస్పీ మాధవరెడ్డి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజుతో కలిసిసమీక్షించారు. కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూవిధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అవసరమైతే క్యూలైన్ల పొడవు పెంచాలన్నారు. సముద్ర స్నానాల వద్ద కంట్రోల్‌రూం, 60 మంది గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్‌జాకెట్లు ఉంచాలన్నారు. రథం ప్రయాణించే మార్గానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల పది రోజులు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లపై డీఎస్పీ మాధవరెడ్డికి సూచనలు చేశారు. అమలాపురం పురపాలక కమిషనర్‌ అయ్యప్పనాయుడు, డీఎల్పీవో విక్టర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధిపై సమీక్ష: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై పురావస్తుశాఖ అధికారులతో ఆర్డీవో వసంతరాయుడు సమీక్షించారు. ప్రతిపాదనలు అందిస్తే జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తానన్నారు. సమావేశంలో పురావస్తుశాఖ ఏడీ తిమ్మరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని