logo

89 ఆమోదం.. 44 తిరస్కరణ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది.

Published : 27 Apr 2024 06:20 IST

నామపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి

కలెక్టరేట్‌లో నామపత్రాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి ఆయా రాజకీయ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలను పరిశీలించారు. పార్లమెంట్‌, అసెంబ్లీకి సంబంధించి మొత్తం 89 నామపత్రాలను ఆమోదించగా 44 తిరస్కరించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియను కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ నిర్వహించగా సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం పరిశీలించారు. వీటిల్లో సక్రమంగా ఉన్న 12 నామినేషన్లను ఆమోదించగా ఏడు తిరస్కరించారు. డమ్మీగా దాఖలు చేసినవి, దరఖాస్తులో వివరాలు తప్పుగా ఉండటం, సంతకాలు లేకపోవడం, అఫిడవిట్‌లు సమర్పించకపోవడం తదితర కారణాలలో వీటిని తిరస్కరించారు. ఇందుకు గల కారణాలు ఆయా అభ్యర్థులకు తెలియజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఎంపీ స్థానానికి ఆమోదం: దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా), గూడూరి శ్రీనివాస్‌ (వైకాపా), గణేశ్వరరావు (బీఎస్పీ), గిడుగు రుద్రరాజు (కాంగ్రెస్‌), బత్తుల బలరామకృష్ణ (నవరంగ కాంగ్రెస్‌), మేడా శ్రీనివాసరావు (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ సెక్యులర్‌), మోహనరావు శింగులూరి (జైభారత్‌ నేషనల్‌ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు జల్లి బాలనవీన, బొమ్మనబోయిన వి.ఎస్‌.ఆర్‌.మూర్తి, భానుచందర్‌ కురువెళ్ల, మెడిసి రత్నారావు అలియాస్‌ వినయ్‌, సాళోపంతుల రాఘవేంద్రరావు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని