logo

హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు

హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

Published : 24 Apr 2024 06:22 IST

పల్లపు అబ్బులు (పాతచిత్రం)

దేవరపల్లి, న్యూస్‌టుడే: హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కొడుకులు, కుమార్తెను కంటి రెప్పలా చూసుకునే కుటుంబ పెద్దను కోల్పోయి వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 19న గోపాలపురం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌ ర్యాలీకి అబ్బులు ద్విచక్ర వాహనంపై యర్నగూడెం నుంచి గోపాలపురం వైపు వెళ్తుండగా కృష్ణంపాలెం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. తలకు బలమైన గాయం కావడంతో గోపాలపురం సీహెచ్‌సీకి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అబ్బులు మృతి చెందారని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కురుకూరులో అబ్బులు మృతదేహానికి హోంమంత్రి తానేటి వనిత నివాళి అర్పించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని