logo

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ భూములను దోచే ప్రమాదం

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు ప్రజల భూములను దోచేసే ప్రమాదముందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated : 04 May 2024 17:32 IST

తాళ్లపూడి: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు ప్రజల భూములను దోచేసే ప్రమాదముందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు, చిడిపి గ్రామాల్లో ఉమ్మడి పార్టీల ప్రచార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ, ఉమ్మడి సంక్షేమ పథకాల కరప్రతాలను అందించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురందేశ్వరిని గెలిపించాలన్నారు. కొత్త చట్టం పేరుతో ప్రజలపై ప్రయోగిస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఐదేళ్లల్లో భూమిని కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారన్నారు. బల్లిపాడు గ్రామంలో సుమారు 10మంది తెదేపాలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కాకర్ల శ్రీనివాసు, అత్కూరి రాంబాబు, వల్లభని శేషగిరిరావు, ఉప్పులూరి రమేష్, వల్లిపల్లి సతీష్, దుగ్గిరాల జగదీష్, ఎల్లిన మణికంఠ, కొడమంచిలి పాపారత్నం, మద్దుకూరి శంకరం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని