logo

మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది.

Published : 06 May 2024 06:08 IST

అమలాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 14,609 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉండగా తొలిరోజు 6,927 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా అమలాపురం నియోజకవర్గంలో 1,338 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో 656 మంది వినియోగించుకున్నారు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఓటింగ్‌ సరళిని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని